వల్లూరులో రెవెన్యూ రీ సర్వే పనుల పరిశీలన
21-11-2026 | 11:07pm
నాగల్గిద్ద, నవంబర్ 21 (విజయక్రాంతి): నాగల్గిద్ద మండలంలోని(Nagalgidda Mandal) వల్లూరు గ్రామంలో చేపట్టిన రెవెన్యూ రీ సర్వే, రీ సెటిల్మెంట్ పనులను తహసీల్దార్ సంగ్రామ రెడ్డి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే పనుల పురోగతిని పరిశీలించి, రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శివరామకృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి, సర్వేయర్ నర్సింలు, గ్రామ పాలన అధికారి అజ్మీర్, లైసెన్స్డ్ సర్వేయర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.