ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి
- మహిళా కమిషనర్ కు కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
ఎల్బీనగర్, నవంబర్ 21 : చంపాపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో(Pension distribution program) మహిళలు, వికలాంగులు పింఛన్లు తీసుకోకుండా అడ్డుకోవడమే కాకుండా... మహిళలతో అసభ్యంగా ప్రవర్తించింది, తోసివేసి బూతులు తిట్టిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిMLA Sudheer Reddy), అతడి అనుచరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదను హస్తినాపురం డివిజన్ మాజీ కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు కంచర్ల కవిత, రజిని రావు, మణిశ్రీ తదితరులు కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు గోపి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కందికంటి శ్రీధర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నేలపాటి రామారావు, డీసీసీ అధికార ప్రతినిధి ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.