మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో బిజెపిలోకి యువత భారీ చేరికలు
గోవిందరావుపేట మండలంలో బిజెపిలోకి భారీ సంఖ్యలో యువకుల చేరికలు
గోవిందరావుపేట,(విజయక్రాంతి): గోవిందరావుపేట మండల(Govindaraopet mandal) కేంద్రానికి చెందిన యువత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party)లో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు సిరికొండ బలరాం నాయక్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) నాయకత్వం సుపరిపాలన దేశ అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పెరుగుతున్న గౌరవం పట్ల ఆకర్షితులై దేశ భవిష్యత్తులో భాగస్వాములు కావాలని ఆశయంతో యువకులు అధిక సంఖ్యలో బిజెపిలో చేరుతున్నారు అన్నారు.
ప్రధానమంత్రి మోడీ నాయకత్వంపై నమ్మకం దేశ అభివృద్ధిపై ఆశయం యువతులు నూతన ఉత్సాహాన్ని మరింత బలమైన అభివృద్ధి కోసం బిజెపి వైపు యువత అడుగులు వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా బిజెపి అధ్యక్షుడు సిరికొండ బలరాం నాయక్ యువకులను కండువా కప్పి బిజెపి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు పర్రెo రఘుపతిరెడ్డి, బండి వేణు, అజ్మీర జవహర్లాల్, వినయ్, మరియు తదితరులు పాల్గొన్నారు.