ఎండు గంజాయి స్వాధీనం
నాగావళి ఎక్స్ప్రెస్ లో తరలిస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
గంజాయితో పాటు యువకుని అరెస్ట్ రిమాండ్
కామారెడ్డి,(విజయక్రాంతి): రైల్లో ఎండు గంజాయి(Dried cannabis)ని తరలిస్తున్న యువకున్ని ఎక్సైజ్ పోలీసులు(Excise police) శనివారం కామారెడ్డిలో పట్టుకున్నారు. 18 కిలోల ఎండు గంజాయిని సూట్ కేసులో భద్రపరిచి ఒరిస్సా నుంచి తరలిస్తున్న 9 లక్షల విలువ చేసే గంజాయిని కామారెడ్డిలో ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి(Excise Superintendent Mukunda Reddy) ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ శ్రీనివాసులు, ఎక్సైజ్ సిబ్బంది కలిసి నాగవల్లి ఎక్స్ప్రెస్ లో ఆర్పిఎఫ్ పోలీసుల సహకారంతో పట్టుకున్నారు.
మధ్యప్రదేశ్ కు చెందిన అశోక్ అనే వ్యక్తి ఒరిస్సా నుంచి మహారాష్ట్ర లోని సోలాపూర్ కు నాగావళి ఎక్స్ప్రెస్ లో 18 కిలోల గంజాయి విలువ తొమ్మిది లక్షలు గల గంజాయిని బ్రీఫ్ కేసులో ప్యాక్ చేసి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. శనివారం కామారెడ్డి ఎక్సైజ్ సూపర్డెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
మధ్యప్రదేశ్ కి చెందిన అశోక్ నాగవల్లి ఎక్స్ప్రెస్ ద్వారా ఒరిస్సా నుంచి మహారాష్ట్ర లోని సోలాపూర్ కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. సిండగా జిల్లావ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి ప్రత్యేక బృందాల ద్వారా కల్తీకల్లు, గుడుంబా, గంజాయి రవాణా పై ప్రత్యేక నిగా పెట్టి తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు సమాచారం అందిస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, టోల్ ఫ్రీ నెంబర్ 18 004252523 లకు సమాచారం అందించవచ్చని ఎక్సైజ్ సూపర్డెంట్ ముకుంద రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ సి.ఐ శ్రీనివాసులు, ఎక్సైజ్ సిబ్బంది అమృత రెడ్డి, రాజు, శిరీష లు పాల్గొన్నారు.