పీఆర్సీ కమిషన్ ఉన్నట్టా? లేనట్టా?
సెప్టెంబర్ 30తో ముగిసిన గడువు
ప్రభుత్వానికి ఇంకా అందని పీఆర్సీ నివేదిక
జూలై 2023 నుంచి ఉద్యోగులకు వర్తించని పీఆర్సీ
అక్టోబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో పీఆర్సీ కమిషన్(Telangana PRC Commission) ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. సెప్టెంబర్ 30తో కమిషన్ గడువు ముగిసినా, గడువు పెంపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. దీంతో అసలు కమిషన్ ఉందా? లేదా? అనే అయోమయం ఉద్యోగ సంఘా ల్లో నెలకొంది. అది ఉద్యోగుల కోసం పనిచేస్తుందా? అని ఉద్యోగ సంఘాలు(Employee Unions) ప్రశ్నిస్తున్నాయి. పీఆర్సీ కమిషన్ గడువు ముగిసి నెల కావొస్తుంది.
సెప్టెంబర్ 9వ తేదీన ఉద్యోగుల జేఏసీ నేతలతో(Leaders of the employees' JAC) జరిగిన చర్చల సందర్భంగా సెప్టెంబర్ 18వ తేదీ లోపు పీఆర్సీ నివేదికను తెప్పించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో దసరాకు తీపి కబురు వస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు(Employees, teachers, and pensioners) ఆశించారు. కానీ, ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా 38 రోజులు గడుస్తోంది. ఇంతవరకు నివేదిక తెప్పించుకోలేదు. అసలు ప్రభుత్వం పీఆర్సీ నివేదికను ఎప్పటివరకు తెప్పించుకుంటుంది? అని ఉద్యోగులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
ముగిసిన గడువు!
తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగియగా, 1 జూలై 2023 నుంచి రెండో పీఆర్సీని ఉద్యోగులకు వర్తింపజేయాల్సి ఉన్నది. కానీ ఇంతవరకు పీఆర్సీని ప్రకటించకపోవడంతో ఉద్యోగులంతా మూడేళ్లుగా నష్టపోతున్నారు. ఉద్యోగ జేఏసీ సైతం నివేదికను తెప్పించుకుని తక్షణమే మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడంలేదని విమర్శలున్నాయి. పీఆర్సీ కమిషన్ గడువు ముగిసి 26 రోజులవుతుంది. మరోసారి ప్రభుత్వం దీని గడువు పొడిగిస్తుందా? లేదా? అనేది కూడా ఉద్యోగ జేఏసీ నేతలకు స్పష్టత లేదు.
దసరాకు వస్తుందని ఆశించిన ఉద్యోగ జే ఏసీ నేతలు ఇక ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నివేదికను త్వరగా ప్రభుత్వానికి అం దజేయాలని పీఆర్సీ చైర్మన్ శివశంకర్‌కు ఇప్పటికే సీఎస్ లేఖ రాశారు. కానీ ఆ నివేదిక ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరలేదని ఉద్యోగ జేఏసీ నేతలు చెప్తున్నారు. ఆరు నెలల్లో కమిటీ నివేదిక సమర్పించాల్సి ఉండగా మూడేళ్ల నుంచి నివేదిక అందనేలేదు, పీఆర్సీ ఉద్యోగులకు వర్తించనూలేదు.
ఇవ్వడం ఇష్టంలేకనే...
పీఆర్సీ కమిషన్ నివేదిక అందిన వెంటనే ఉద్యోగుల జీతాల పెంపు, ఫిట్మెంట్ శాతంపై స్పష్టమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. నివేదిక ప్రభుత్వానికి చేరిన వెంటనే ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతలు ఒత్తిడి తీసుకొస్తారు. వాస్తవానికి గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్లు పీఆర్సీపై కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో పీఆర్సీ అమలుచేస్తారనే ఆశతో ఉన్నారు. కానీ దీనిని అమలుచేస్తే ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందనే భావనలో సర్కారు ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఇలా ంటి సమయంలో ప్రభుత్వం పీఆర్సీని ప్రకటిస్తుం దో..లేదోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
నష్టపోతున్న ఉద్యోగులు...
వాస్తవానికి పీఆర్సీ కమిషన్ నివేదికను ఎప్పుడో సిద్ధం చేసి ఉంచింది. ఇది అందరికీ తెలుసు. కానీ కావాలనే ప్రభుత్వం నివేదికను తెప్పించుకోవడంలేదని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పీ ఆర్సీ అమలుచేయకపోవడంతో ఉద్యోగులు మూడే ళ్ల నుంచి నష్టపోతున్నారు. 1 జూలై 2023 నుంచే ఈ రెండో పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. ఉద్యోగ సంఘాలు 50 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని కోరుతున్నాయి. కనీసం ఒక శాతం ఫిట్మెంట్ ప్రకటించినా ఏడాదికి దాదాపు రూ. 200కోట్లకు పైగానే అవుతుంది.
అయితే ప్రభుత్వం 10 శాతం ఇస్తుం దా? 20 శాతం ఇస్తుందా? లేక 30 శాతం ఇస్తుం దా? అనేది తేలాల్సి ఉంటుంది. ఉద్యోగ సంఘాలు కూడా 20 నుంచి 30 శాతం వరకు ఇచ్చినా ఒప్పుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎం త ఇస్తుందనేది పీఆర్సీ నివేదిక అందిన తర్వాతే స్పష్ట త వస్తుంది. గతంలో మొదటి తెలంగాణ పీఆర్సీ కమిషన్ 7.5 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసినా, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెండో పీఆర్సీ కనీసం ఫిట్మెంట్ 45 నుంచి 50 శాతం వరకూ ప్రకటించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.