7న ఏఈఈ పరీక్ష
- రీషెడ్యూల్ చేసిన టీజీపీఎస్సీ
- జేఈ టెస్ట్ రాసే వారికే మినహాయింపు
- రెండింటికి దరఖాస్తు చేసిన ఆధారాలు చూపాల్సిందే
- టీజీపీఎస్సీ కమిషన్
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(Telangana Public Service Commission) (టీజీపీఎస్సీ) నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(Assistant Executive Engineer) (ఏఈఈ) పరీక్ష తేదీపై కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల(candidates) విజ్ఞప్తులపై కమిషన్ స్పందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ(Central Government Organization) నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్(Staff Selection Commission Junior Engineer) (జేఈ) పరీక్ష తేదీ, టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్ష తేదీ నవంబర్ 6నే కావడం.. రెండు పరీక్షలకు ప్రిపేరైన అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో పలువురు కమిషన్ను ఆశ్రయించారు.
పరీక్ష తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన టీజీపీఎస్సీ నవంబర్ 6న జరగాల్సిన ఏఈఈ పరీక్షను మరుసటి రోజుకు మార్చింది. నవంబర్ 7వ తేదీకి రీషెడ్యూల్ చేసింది. అయితే, రెండు పరీక్షల తేదీలు క్లాష్ అవుతున్న అభ్యర్థులు మాత్రమే ఈ సదుపాయం కోసం తగిన ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది.
రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత హాల్ టికెట్లు లేదా దరఖాస్తు పత్రాలను కమిషన్కు ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల గంటలలోపు అధికారిక ఈ--మెయిల్ ద్వారా పంపించాలని సూచించింది. నిర్ణీత గడువులోగా వచ్చిన విజ్ఞప్తులను మాత్రమే పరిశీలించి, పరీక్ష నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేసింది.