సిరిసిల్లలో శ్రీవారి రథోత్సవం
హాజరైన విప్ ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సిరిసిల్లలో(Sircilla) శ్రీ శాల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో(devotional) కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన స్వామివారి రథోత్సవ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Adi Srinivas), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్(KTR) పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి కేటీఆర్ అత్యవసర వైద్య పరికరాలను అందజేశారు.
వెంకన్న సేవలో కేటీఆర్
- గోవింద నామస్మరణతో మార్మోగిన లింగన్నపేట
- వైభవంగా శ్రీవారి గరుడసేవ
- స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కేటీఆర్
గంభీరావుపేట, అక్టోబర్ 26 (విజయక్రాంతి): గోవింద నామస్మరణ, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల(devotees) కోలాహలం నడుమ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో కొలువుదీరిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. ఏడు రోజుల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన శ్రీవారి గరుడసేవ భక్తజన సందోహం మధ్య వైభవోపేతంగా సాగింది.
గరుడ వాహనంపై విహరిస్తున్న శ్రీవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు(devotees) పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘గోవిందా.. గోవిందా..’ అంటూ భక్తులు చేసిన నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. గరుడసేవలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
గరుడ వాహనాన్ని లాగారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు చిన్నారులు, మహిళలు, యువకులు పోటీ పడ్డారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ పాపారావు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాప్స్‌కాబ్ చెర్మన్ కొండూరు రవీందర్రావు, సర్పంచ్ పిట్ల ఎల్లయ్య, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు.