జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
టీయూడబ్ల్యూజే–ఐజేయూ చేవెళ్ల ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం
మొయినాబాద్ అక్టోబర్ 10(విజయక్రాంతి): టీయూడబ్ల్యూజే–ఐజేయూ చేవెళ్ల నియోజకవర్గ(TUWJ-IJU Chevella Constituency) ఎలక్ట్రానిక్ మీడియా ఎన్నికల్లో(Electronic media selection) మొయినాబాద్ మండలానికి చెందిన రాంవల్లి సంతోష్‌కుమార్ చారి రంగారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, బాకారం గ్రామానికి చెందిన కొండకళ్ల శ్రీకాంత్ జనరల్ సెక్రటరీగా, అమ్దాపూర్ కు చెందిన సామ వామన్‌రెడ్డి జాయింట్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎన్నికలను రాష్ట్ర కార్యదర్శి కొంవల్లి శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు శ్రీశైలం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ.. ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి, వారికి అండగా నిలవాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘం తరఫున కృషి చేస్తామని తెలిపారు.