పంట పొలాలను పరిశీలించిన బిఆరెస్ నాయకులు

16-10-2026 | 05:25pm

రుద్రంగి అక్టోబర్ 16(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో కరెంట్ కోతలతో ఎండిన పంట పొలాలను బిఆరెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దయ్యాల కమలాకర్(Dayyala Kamalakar, BRS party village branch president) ఆధ్వర్యంలో బిఆరెస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్బంగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం మాట్లాడుతూ.వేములవాడ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మేడ లక్ష్మీ నరసింహారావు ఆదేశాల మేరకు కరెంట్ కోతలపై నిరసన తెలపడం జరిగిందని అన్నారు.

కాంగ్రెస్ కు ఓటేస్తే గోస పడుతామని కేసీఆర్ అప్పుడే ప్రజలకు రైతులకు చెప్పారని కానీ కాంగ్రెస్ చెప్పిన మోస పూరిత హామీలను నమ్మి ఓటేస్తే రేవంత్ సర్కార్ రైతులను నట్టేట ముంచుతుందని అన్నారు.ఎల్ నీనో ప్రాభావంతో వర్షాలు సరిగా పడకపోయినా ఉన్న నీటితో పంటను కాపాడుకుందాం అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ కోతలు పెట్టడంతో పంటాలు ఎండుతున్నాయని అన్నారు.

ఈ ఎండిన పంటలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యనికి నిదర్శనం అని అన్నారు.కరెంట్ కోతలతో పంటలకు సరిగ్గ  నిరందాకా ఎండుతున్నాయాని అలాగే మోటార్లు కూడా కాలిపోతున్నాయనీ అన్నారు.కొందరు రైతులు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక జనరేటర్లు కొనుగోలు చేసి పొలాల్లో వాడుతున్నారని అన్నారు. నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని చెప్పడమే తప్ప ఇచ్చింది లేదని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నారని అన్నారు.

రైతులు ఇకనైనా మౌనం వీడి ప్రభుత్వన్ని నిలదీసి అడగాలని అన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వనికి రైతులు తగిన  బుద్ది చెపుతారని అన్నారు.రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించలేని ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి మంచే రాజేశం,వార్డు మెంబర్లు ఉప్పులూటి గణేష్, చెప్యాల గణేష్,నాగులపెల్లి రవీందర్,అల్లూరి గంగారెడ్డి,లంకదాసరి మణిదీప్, బోయిని చంద్రయ్య,ఏండి బాబా, సింగారపు గంగారెడ్డి, దయ్యాల పెద్దులు,మోహన్, పాల్గొన్నారు......

మరిన్ని వార్తలు