పారిశుధ్య కార్మికులకు రక్షణ హస్తం

16-10-2026 | 05:27pm

కార్మికుల సంక్షేమానికి మున్సిపాలిటీ ప్రాధాన్యం

చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్...

ఆలేరు, అక్టోబర్ 16 (విజయక్రాంతి): ఆలేరు మున్సిపాలిటీ(Aler Municipality) పరిధిలో పారిశుధ్య సేవలు అందిస్తున్న కార్మికుల సంక్షేమాన్ని(Welfare of workers) దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు(Essential commodities), రక్షణ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులకు సంతూర్ సబ్బులు, బట్టలు ఉతికే సబ్బులు, కొబ్బరి నూనెతో పాటు మాస్కులు, గ్లౌజులు, అప్రాన్లను అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బీజన బాలమణి భాస్కర్(Beejana Balamani Bhaskar) మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజారోగ్య పరిరక్షణ(Protection of Public Health) కోసం వారు ప్రతిరోజూ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

కార్మికుల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. విధులు నిర్వహించే సమయంలో కార్మికులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా మాస్కులు, గ్లౌజులు, అప్రాన్లు వంటి రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగిడి అంజనేయులు, కౌన్సిలర్లు వనరాసి మరియమ్మ మార్క్, పస్తం అంజనేయులు, మల్లెల సరిత శ్రీకాంత్, జూకంటి సంపత్, జెట్టా నిరజ సిద్దులు, మున్సిపల్ మేనేజర్ బి. జగన్ మోహన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎస్. స్వామి, జవాన్లు, మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు