పెద్ద కంజర్లలో ‘చిత్రధార’ గిరిజన చిత్రలేఖన శిక్షణ ప్రారంభం

28-10-2026 | 09:51pm

పటాన్‌చెరు:  పెద్ద కంజర్ల గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల(Pedda Kanjarla Tribal Welfare Degree College)లో ఏడు గిరిజన డిగ్రీ కళాశాలలు, ఒక లా కళాశాల విద్యార్థుల కోసం నాలుగు రోజుల ‘చిత్రధార’ గిరిజన చిత్రలేఖన శిక్షణ కార్యక్రమం(Tribal Painting Training Program) ప్రారంభమైంది. గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి కె. సీతా లక్ష్మి, IAS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

TCRTI నిపుణులు నాయకపోడు, కోయ, గోండు, లంబాడీ తెగల సంప్రదాయ చిత్రకళలపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గురుకుల జాయింట్ సెక్రటరీ డి.ఎస్. వెంకన్న, ఇతర అధికారులు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు