మోర్గి ఇండస్ట్రియల్ పార్క్‌కు గెజిట్ నోటిఫికేషన్
133 ఎకరాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వేకు అధికారుల సన్నాహాలు
నాగలిగిద్ద, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): నాగలిగిద్ద మండలం మోర్గి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్(Morgi Industrial Park) ఏర్పాటుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో అధికారులు రైతులతో గ్రామసభ నిర్వహించారు. త్వరలో చేపట్టనున్న ఎంజాయ్‌మెంట్ సర్వేపై రైతులకు వివరించారు. మొత్తం 133 ఎకరాల భూమిలో సర్వే నిర్వహించనున్నట్లు ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ దీపిక సూచించారు.
కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శివరామకృష్ణ, టీజీఐఐసీ అధికారి శ్రీనివాస్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అనిల్ రెడ్డి, సర్పంచ్ అన్నపూర్ణ శివశరణప్ప, మాజీ ఎంపీటీసీ నందు పాటిల్, గ్రామ పాలన అధికారి విష్ణు, గ్రామ పెద్దలు, రైతులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.