ఒడ్డే ఓభన్న 180వ వర్ధంతి

06-10-2026 | 02:58pm

రామచంద్రపురం ఆగస్టు 06: రామచంద్రపురం పట్టణంలోని వడ్డెర బస్తీలో ఒడ్డే ఓభన్న 180వ వర్ధంతి(Death Anniversary Odde Obhanna)సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒడ్డే ఓభన్న పోరాట స్ఫూర్తిని దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేయడంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రానికి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.

ఆ చిత్రం వచ్చిన తర్వాత ఒడ్డే ఓభన్న గురించి తమ వడ్డెర కులస్తుల్లో మరింత అవగాహన పెరిగిందని, ఆయనను స్మరించుకుంటూ జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. వడ్డెర సమాజానికి చెందిన వీరుల చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఒడ్డే ఓభన్న ధైర్యం, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, ఆయన చరిత్రను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం మన సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తునందుకు వడ్డెర కులస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డా. వరీకుప్పల లింగయ్య వడ్డెర సంక్షేమ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎట్టయ్య, సిద్దయ్యా, పెద్దులు, సత్తయ్య, మురళి, యాదయ్య, మల్లయ్య, సైదులు, వీరయ్య, కుల సోదరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు