ఐఫోన్ 16 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. రూ.75,905కే సొంతం!
యాపిల్ ఐఫోన్(Apple iPhone) కొనాలని ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ 16 ప్లస్ ధర(iPhone 16 Plus Price) భారీగా తగ్గింది. బ్యాంక్ ఆఫర్లను కూడా వినియోగించుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.76 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. యాపిల్ ఐఫోన్ 16 ప్లస్(iPhone 16 Plus) 128GB వేరియంట్ అసలు లాంచ్ ధర రూ.89,900. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్(Flipkart)లో ఈ ఫోన్ రూ.79,900కు లభిస్తోంది. అంటే నేరుగా రూ.10 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. దీనికి అదనంగా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసే అర్హులైన వినియోగదారులకు రూ.3,995 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్లను కలిపితే ఫోన్ ధర రూ.75,905కు చేరుతుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఐఫోన్ 16 ప్లస్‌లో 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, డైనమిక్ ఐలాండ్ ఉన్నాయి. యాపిల్ A18 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ రోజువారీ వినియోగంతో పాటు మల్టీటాస్కింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వెనుకవైపు 48MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా అందించారు. USB-C ఛార్జింగ్, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. పెద్ద డిస్‌ప్లే, మంచి కెమెరా, యాపిల్ ఎకోసిస్టమ్ కోరుకునే వారికి ఈ డీల్ ఆకర్షణీయంగా ఉండొచ్చు. అయితే బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌కు సంబంధించిన అర్హతలు, ఆఫర్ గడువు, స్టాక్ వివరాలను కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌లో పరిశీలించాలి.