పోచమ్మతల్లి ఆలయ నిధులపై పంచాయితీ!

06-11-2026 | 10:32am

పటాన్‌చెరు, నవంబర్ 6 (విజయక్రాంతి): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని మహదేవపురం కాలనీ శ్రీ పోచమ్మతల్లి ఆలయ నిధుల వినియోగంపై వివాదం నెలకొంది. ఆలయానికి రూ.15.82 లక్షల విరాళాలు రాగా, రూ.22.07 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కల్లో చూపించారని దాత, న్యాయవాది ప్రతిపతి మాధవ ఆరోపించారు.

గోపుర నిర్మాణం (Temple Tower Construction) కోసం తాను అందించిన రూ.1.11 లక్షల విరాళం వినియోగంపై స్పష్టత లేదని అన్నారు. రూ.29 లక్షల నిర్మాణ ఒప్పందం (Construction Agreement) ఖర్చులపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. లెక్కలు అడిగినందుకు ఆలయ కమిటీ అధ్యక్షుడు ఐలాపురం నవీన్ కుమార్ బెదిరించారని ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆలయ ఆర్థిక లావాదేవీలపై (Financial Transactions) సమగ్ర విచారణ జరిపి, నిధుల వినియోగంలో పారదర్శకత (Financial Transparency) కల్పించాలని కోరారు. ఈ ఆరోపణలపై ఆలయ కమిటీ స్పందన తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు