విడాకుల రూమర్లకు చెక్

06-11-2026 | 11:13am

ఐశ్వర్య చూపుల్లో ప్రేమ.. అభిషేక్‌ చేతిలో చేయి.. వైరల్ వీడియో!

బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ చాలా రోజుల తర్వాత కలిసి పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీశ్ మల్హోత్రా నిర్వహించిన Diwali Partyకి జంటగా హాజరయ్యారు. ఒకరిపై ఒకరు ప్రేమను చూపిస్తూ కెమెరాలకు పోజులివ్వడంతో ఆ వీడియో Social Mediaలో వైరల్‌గా మారింది. ఈ వేడుకలో అభిషేక్ బ్లాక్ కుర్తాలో కనిపించగా, ఐశ్వర్య ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో ఐశ్వర్య ప్రేమగా అభిషేక్ వైపు చూస్తూ ఆయన ఛాతీపై తల వాల్చారు. అభిషేక్ కూడా ఆమె చేతిని పట్టుకుని ఆప్యాయతను చాటారు. ఈ క్యూట్ మూమెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

గత కొంతకాలంగా వీరి వైవాహిక జీవితంపై Divorce Rumours, విడాకుల ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అభిషేక్ గతంలోనే ఈ వార్తలను ఖండించారు. తాజాగా ఇద్దరూ కలిసి కనిపించడంతో మరోసారి వారి అనుబంధంపై చర్చ మొదలైంది. ఈ వేడుకకు కుమార్తె ఆరాధ్య మాత్రం హాజరుకాలేదు. 1999లో ‘ఢాయ్ అక్షర్ ప్రేమ్ కే’ సినిమా ఫొటోషూట్‌తో మొదలైన వీరి పరిచయం.. కలిసి నటించిన సినిమాలు, స్నేహం ద్వారా ప్రేమగా మారింది. 2007 ఏప్రిల్ 20న ముంబయిలో వివాహం చేసుకున్న ఈ జంటకు 2011లో కుమార్తె ఆరాధ్య జన్మించింది.



మరిన్ని వార్తలు