సూర్య ‘సీన్’కు సూపర్ టాక్

06-11-2026 | 11:05am

సూర్య ఖాతాలో మరో హిట్? ‘సీన్’ ట్విట్టర్ రివ్యూ వైరల్!

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ నవంబర్ 6న థియేటర్లలో విడుదలైంది. జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ Action Comedy Thrillerపై సోషల్ మీడియాలో పాజిటివ్ స్పందనలు వస్తున్నాయి. సినిమా First Half అదిరిపోయిందని ఓ నెటిజన్ ప్రశంసించాడు. సూర్య నటన, యాక్షన్ సన్నివేశాలు, కామెడీతో పాటు ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయని అభిప్రాయపడ్డాడు. జ్యోతిక, నెస్లేన్ నటన కూడా ఆకట్టుకుందని పేర్కొన్నాడు. వినీత్ అగస్టియన్ Cinematography, సుషీన్ శ్యామ్ Music సినిమాకు బలంగా నిలిచాయని ప్రేక్షకుల అభిప్రాయాలు సూచిస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్స్ లో వ్యక్తమవుతున్న కొందరి తొలి స్పందనలు మాత్రమే. పూర్తి స్థాయి Public Talk, సెకండాఫ్‌పై అభిప్రాయాలు, Box Office కలెక్షన్లపై స్పష్టత రావాల్సి ఉంది. సూర్య అభిమానుల్లో మాత్రం ‘సీన్’పై ఆసక్తి పెరుగుతోంది.

'సీన్' సినిమా గురించి మరిన్ని వివరాలు

ఈ సినిమాలో సూర్య, తన ఉద్యోగం పట్ల ఏమాత్రం ఆసక్తి లేని, తిరిగి విధుల్లో చేరాలనే ఆలోచన కూడా లేని డీఎస్పీ ఇన్‌బరాజ్ అనే పోలీస్ అధికారి పాత్రను పోషించారు. సూర్య, నజ్రియా, నస్లెన్‌లతో పాటు, ఈ చిత్రంలో ఆనందరాజ్, లాల్, రాజ్ ప్రియన్ వంటి ప్రముఖ తారాగణం కూడా ఉంది. 'సీన్' చిత్రాన్ని జ్యోతిక, సూర్య 'ఝగారం స్టూడియోస్' బ్యానర్‌పై నిర్మించారు.  ఇక సినిమాల విషయానికొస్తే, సూర్య చివరిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా 'విశ్వనాథ్ & సన్స్'లో కనిపించారు. ఈ చిత్రంలో మమితా బైజు, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, సునీల్ రెడ్డి, హారిక, నస్సర్, రాజీవ్ మీనన్ కూడా నటించారు. ఈ చిత్రం, సరోగసీ ద్వారా తండ్రి అయిన సంజయ్ విశ్వనాథ్ అనే విజయవంతమైన పారిశ్రామికవేత్త, మ్యాడీ అనే మెడికల్ విద్యార్థినితో ఏర్పరచుకునే సన్నిహిత బంధం చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది.


మరిన్ని వార్తలు