పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

22-10-2026 | 05:30am

సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి):  శాంతి భద్రతల పరిరక్షణ(Maintenance of law and order) కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించు కోవడం,

వారి కుటుంబాల త్యాగాలను గు ర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గు ర్తు చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ తో కలిసి పోలీస్ అమరవీరుల స్థూపం  వద్ద  పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ, శాంతిభద్రత ల పరిరక్షణ విధుల్లో పోలీసులు అనునిత్యం నిమగ్నమై ఉంటారని, ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా ఎదుర్కొంటారని  అన్నారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన పోలీసు అమరవీరులు జంగయ్య (సిర్గాపూర్ పోలీస్ స్టేషన్), ఎల్లయ్య (సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్), సత్యనారాయణ (జిన్నారం పోలీస్ స్టేషన్), సురేష్ (కంగ్టి పోలీస్ స్టేషన్) ప్రజల రక్షణ కోసం చేసిన వారి ధైర్య సాహసాలను, సేవలను కొనియాడారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ దేశ భద్రత, శా ంతిభద్రతల పరిరక్షణ,

ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఎం తోమంది పోలీసులు విధి నిర్వహణలో ప్రా ణాలు కోల్పోయారని గుర్తుచేశారు.

ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని, అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకు ని ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది ప్రజల రక్షణకు అంకితభావంతో పనిచేయాలన్నా రు. ఈ సందర్భంగా జిల్లా లో విధినిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబీకుల కు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎ స్పి చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సిఐలు, సిబ్బంది, అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు