మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
సత్తుపల్లి (విజయక్రాంతి): భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు, ఆధునిక విద్యావ్యవస్థకు పునాదులు వేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల(Maulana Abul Kalam Azad Jayanti Celebrations)ను సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్పర్సన్ రిహానా బేగం, కమల్ పాషా, సత్తుపల్లి నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాదె చెన్నారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భీమిరెడ్డి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు శివ, వేణు, సామేలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.