ఉమ్మడి మెదక్‌ను ముంచేసిన కరువు!

29-10-2026 | 05:00am
  • 37 మండలాలు ‘డ్రై జోన్’.. 
  • కోరలు చాచిన ఎల్‌నినో
  • అగ్రస్థానంలో సంగారెడ్డి జిల్లా..
  • ఒకే మండలంతో మెదక్

సంగారెడ్డి బ్యూరో/ సిద్దిపేట/మెదక్ (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా ఎల్నినో ఎఫెక్ట్, నైరుతి రుతుపవనాల నిరాశ కారణంగా అన్నదాతల గుండెలు పగిలాయి. రాష్ట్ర వ్యాప్తంగా 365 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం(Telangana government) అధికారిక జీవో జారీ చేయగా, ఇందులో ఉమ్మడి మెదక్ జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని 37 మండలాల్లో పంటలు ఎండిపోయి, భూ గర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.

సంగారెడ్డికి అగ్రస్థానం.. మెదక్‌కు ఊరట

ప్రభుత్వ నివేదిక ప్రకారం.. నల్గొండతో పాటు సంగారెడ్డి జిల్లా 28 కరువు మండలాలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎటు చూసినా ఎండిపోయిన పంట పొలాలు, నిజాంసాగర్, సి ంగూరు ప్రాజెక్టుల్లో అడుగ ంటిన నీటి నిల్వలు ఇక్కడి తీ వ్రతకు అద్దం పడుతున్నాయి.

స ంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, కంది, కొ ండాపూర్, సదాశివపేట, పటాన్చెరు, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం, జహీ రాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, నారాయణఖేడ్, కల్హేర్, సిర్గాపూర్, మనూరు, నాగిల్గిద్ద, పెద్దశంకరంపేట, పాపన్నపేట, పుల్కల్, చౌటకూర్, ఆందోల్, టేక్మాల్, అల్లాదుర్గ్, రేగోడ్, వట్పల్లి, మునిపల్లి మండలాలు ఉన్నాయి. మరోవైపు సిద్దిపేట జిల్లాలో తొగుట, దౌలతాబాద్, మిరుదొడ్డి, దుబ్బాక, గజ్వేల్, జగదేవ్పూర్, కొండపాక, చేర్యాల మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా, మెదక్ జిల్లాలో మాత్రం కేవలం మనోహరాబాద్ ఒక్క మండలంతో రాష్ట్రంలోనే అత్యల్ప కరువు నమోదైన జిల్లాగా నిలిచింది. 

ఎండిన పంటలు.. అడుగంటిన జలాశయాలు

జూన్ నుండి సెప్టెంబర్ వరకు కురవాల్సిన వర్షపాతంలో భారీ లోటు నమోదు కావడమే ఈ దుస్థితికి కారణం. ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి, ఇతర వాణిజ్య పంటలు చేతికి రాకుండానే ఎండిపోయాయి. చెరువులు, కుంటలు వెలవెలబోతుండటంతో రాబోయే రోజుల్లో తాగునీటితో పాటు పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.

ప్రభుత్వ సహాయక చర్యలు.. రుణాల రీషెడ్యూల్

కరువు ప్రకటించిన మండలాల్లో తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. నష్టపోయిన రైతులకు నేరుగా డీబీటీ ద్వారా సబ్సిడీ జమ చేయనున్నారు. పాత వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయాలని, బ్యాంకర్లు బలవంతపు వసూళ్లకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. పశుగ్రాసం కొరత లేకుండా చూడటం, తాగునీటి సరఫరాను మెరుగుపరచడంతో పాటు వలసలను అరికట్టేందుకు ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయనున్నారు.

మరిన్ని వార్తలు