దివ్యాంగుల స్వావలంబనకు పీర్ ట్రైనింగ్ దోహదం
పటాన్చెరు, నవంబర్ 27: వెన్నుపాము గాయాలకు గురైన వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో, ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించేలా శిక్షణ, అవకాశాలు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి(District Welfare Officer Lalitha Kumari) పేర్కొన్నారు. రుద్రారం డోయన్ కౌంటీ టౌన్‌షిప్‌లోని(Rudraram Doyen County Township) ట్రియో రిసార్ట్స్‌లో మోటివేషన్ ఇండియా(Motivation India at Trio Resorts), SCIAT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మూడు రోజుల పీర్ ట్రైనింగ్ కార్యక్రమంలో రెండో రోజు ఆమె పాల్గొన్నారు. దివ్యాంగుల పునరావాసం, జీవన నైపుణ్యాలు, విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు ఇటువంటి శిక్షణలు ఎంతో దోహదపడతాయని అన్నారు.
SCIAT రాష్ట్ర అధ్యక్షుడు షఫీ మాట్లాడుతూ, దివ్యాంగులకు సమాన అవకాశాలు, ఉపాధి, స్వతంత్ర జీవనం కల్పించడమే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, పీర్ ట్రైనర్లు, దివ్యాంగులు పాల్గొన్నారు.