నిబద్దతతో విధులు నిర్వహించాలి
- పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్
- కోహెడ పిఎస్ తనిఖీ
కోహెడ, నవంబర్ 27: నిబద్దతతో విధులు నిర్వహించాలని.. పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్(Police Commissioner Rashmi Perumal) పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం పీస్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా కిట్ ఆర్టికల్స్‌ను, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులు, అన్ని వర్టికల్స్ పనితీరును సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రతి ఒక్కరు విధుల్లో క్రమశిక్షణతో పాటగా ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటిని త్వరితగతిన పరిష్కరించాన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని మరింతగా పెంచాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రతి గ్రామంలో 'సిద్దిపేట సురక్ష నేత్ర' కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల నిఘాను పెంచేలా ఎస్ఐ అభిలాష్ ను ఆదేశించారు. అనంతరం సిబ్బంది యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం లో హుస్నాబాద్ ఏసిపి సదానందం, ట్రైనీ డీఎస్పీలు సుమా శ్రీ, భారత్ రెడ్డి, ముషరఫ్, హుస్నాబాద్ సీఐ శ్రీదర్, ఎస్ఐ అభిలాష్, సిబ్బంది పాల్గొన్నారు.