అక్కన్నపేట మండల రజక సంఘం నియామకం
కోహెడ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): అక్కన్నపేట మండల రజక సంఘం ఎన్నికలు(Rajaka Association Elections) బుధవారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్, జిల్లా అధ్యక్షుడు ఐలయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధీటి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంతకపేట గ్రామానికి చెందిన జంగపల్లి రఘుపతి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షుడిగా ఊళ్లెంగుల రాజు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్ళపల్లి పరుశురాములు, కార్యదర్శిగా కొలిపాక అశోక్, కోశాధికారిగా వంగపల్లి రాజు, ప్రచార కార్యదర్శిగా పాండ్రాల మోహన్ బాబు, కార్యవర్గ సభ్యులుగా బందారం రమేష్, వంగపల్లి సమ్మయ్య, తంగళ్ళపల్లి రమేష్,
కొలుగూరి అజయ్, కోలిపాక రమేష్, జంగపల్లి రాజశేఖర్, కొలుగూరి కుమార్, నాంపల్లి పోచయ్య, గంపల బాలయ్య, జంగపల్లి రవీందర్ పరుశురాములు ఎన్నికయ్యారు. కాగా బీసీ-ఏలో రజకులతో పాటు 56 ఉప కులాలు ఉన్నాయని, 36 లక్షలకు పైగా బీసీ-ఏ లో జనాభా ఉందని.. తమ హక్కుల సాధారణ కు జాగృతి కావాలని రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.