పందులను కొట్టాల్లోకి తరలించాలి
06-11-2026 | 05:51pm
ఈ నెల 9 వరకు గడువు విధించిన గ్రామపంచాయతీ
బెజ్జంకి (విజయక్రాంతి): గ్రామంలో పందుల సంచారాన్ని నియంత్రించేందుకు గ్రామపంచాయతీ చర్యలు(Gram Panchayat Actions) చేపట్టింది. ఈ నెల 9వ తేదీలోగా పందుల పెంపకందారులు(Pig farmers) తమ పందులను గ్రామంలోని వీధుల్లోకి వదలకుండా కొట్టాల్లోనే ఉంచాలని సర్పంచ్ బొల్లం శ్రీధర్(Sarpanch Bollam Sridhar) సూచించారు. గ్రామసభలో ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి గ్రామంలో ఎక్కడైనా పందులు స్వేచ్ఛగా సంచరిస్తూ కనిపిస్తే వాటిని పట్టుకుని తరలిస్తామని స్పష్టం చేశారు.