సిద్దిపేటలో టీఆర్ఎస్ తొలి కార్యాలయం

28-10-2026 | 09:55pm

13న కవిత భూమిపూజ

పార్టీ జిల్లా అధ్యక్షుడు లోక రవిచంద్ర

సిద్దిపేట క్రైం: రాష్ట్రంలో మొట్టమొదటి తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ జిల్లా కార్యాలయం(TRS Office) సిద్దిపేటలో నిర్మాణానికి నవంబర్ 13న కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)  భూమిపూజ చేస్తారని ఆ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు లోక రవిచంద్ర తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లారం మల్లారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.  బీఆర్ఎస్ పాలనలో జిల్లాలో  నిరుద్యోగులు, నిర్వాసితులు, వలసలు పెరిగిపోయాయన్నారు.

బలవంతంగా భూములు లాక్కున్నా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాలేదని, నిర్వాసితులకు పరిహారం పూర్తిగా అందలేదని చెప్పారు. చదువుకున్న వాళ్లు అమెరికాకు, చదువుకోనోళ్లు దుబాయ్ కి, ఏమీ లేనివాళ్లు సిద్దిపేట లో ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున పోరాడుతామని తెలిపారు. ఈ నెల 30న ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 'పాంచజన్య సభ'కు సిద్దిపేట జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

మరిన్ని వార్తలు