అన్న దానం మహా దానం

14-10-2026 | 04:36pm

జగదేవపూర్,(విజయక్రాంతి): జగదేవపూర్ మండల(Jagadevpur Mandal) పరిధిలోని మునిగడప గ్రామంలో ఊరి మధ్యలో బొడ్రాయి దగ్గర ఏర్పాటు చేసిన దుర్గ మాత సన్నిధానంలో వీరబద్ర ఫర్టిలైజర్(Veerabhadra Fertilizers) కొత్తపల్లి విజయ్ కుటుంబం సమేతంగా అన్న దాన చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్న దానం మహా దానం అని పేర్కొన్నారు. ఆకలితో ఉన్నవారికీ పట్టేడు అన్నం పెడితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని అన్నారు. విజయ్ కుటుంబనికి అమ్మవారి కృప ఉండాలి యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వార్డు సభ్యులు గుర్రం శ్రీధర్, వినయ్, శ్రీకాంత్, చల్ల వంశీ, గుర్రం అశోక్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు