నిర్మల్ డిపోకు అవార్డులు

14-10-2026 | 05:37pm

నిర్మల్ (విజయక్రాంతి): ఆర్టీసీ(RTC) ఆదిలాబాద్ రీజియన్ స్థాయిలో ఉట్నూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో నిర్మల్ డిపోకు చెందిన నలుగురు డ్రైవర్లు ఏ. రాజేశ్వర్, జే. రాజేశ్వర్, దశరథ్, అలీమ్ లకు ప్రగతి రథ చక్ర అవార్డు దక్కింది. ఈ అవార్డు ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ విజయబాను చేతులమీదుగా ప్రశాంసా పత్రాలు అందుకున్నారు. 

వీరు ఆదిలాబాద్ రీజియన్ లో అత్యధిక ఆయిల్ పొదుపు, అత్యధిక ఆదాయం తీసుకువచ్చినందులకు వీరికి అవార్డులు ఇచ్చినందులకు ప్రదానం చేయడం జరిగిందని వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగితా ఉద్యోగులు కూడా సంస్థ అభివృద్ధికి సహకరించాలని ఆర్.ఎం తెలిపారు. ఈ కార్యక్రమములో డిప్యూటీ ఆర్.ఎం(ఓ) మల్లేశం డిప్యూటీ ఆర్ ఎం. (ఎం) రామయ్య నిర్మల్ డిపో మేనేజర్ కే.పండరి.నిర్మల్ అసిస్టెంట్ ఇంజనీర్(ఎం) శ్రీకర్ నిర్మల్ అసిస్టెంట్ మేనేజర్ ధనుంజయ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు