మోడల్ పాఠశాల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే హామీ
గణపురం, అక్టోబర్ 14 (విజయక్రాంతి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao)ను మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ తిరుపతి ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో కలిసి పాఠశాలలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అధిక విద్యుత్ భారం కారణంగా తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కరించాలని, అవసరమైతే విద్యుత్ తీగల వ్యవస్థను పూర్తిగా మార్చాలని ఆదేశించారు. విద్యార్థులకు ఫ్యాన్లు లైట్లు, ఏర్పాటు చేయడంతో పాటు నీటి సరఫరా, మరుగుదొడ్ల మరమ్మతులు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ప్రిన్సిపల్ తిరుపతి తెలిపారు