ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి

14-10-2026 | 05:47pm

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు

ముకరంపుర, అక్టోబర్ 14(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) కింద పనిచేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది తమ న్యాయమైన హక్కుల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మెకు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) పూర్తి మద్దతు తెలియజేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి రావు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ కింద పనిచేస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం పైగా సాలరీలు, ఇన్సెంటివ్స్ సమకూరుస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నలబై శాతం వాటా విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు.

ప్రతి సంవత్సరం ఐదు శాతం ఇంక్రిమెంట్, ఎనిమిది శాతం లాయల్టీ బోనస్, ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హెల్త్ సిబ్బందికి  వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనియెడల ఉద్యోగుల లక్ష్యాలకు మద్దతుగా పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్  సిబ్బంది మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు