5 September, 2026 | 9:15 AM

రోహిత్ యాదవ్‌పై వేటు

05-09-2026 | 05:10am
  1.    62 మంది క్రికెటర్లపై నిషేధం
  2. వయసు మోసాలపై బీసీసీఐ చర్యలు

ముంబై, సెప్టెంబర్ 4 : భారత క్రికెట్‌లో(Indian cricket,) భారీ వయసు మోసం బయటపడింది. తప్పుడు సర్టిఫికెట్లతో(false certificates) అసలు వయసును దాచిపెట్టిన 62 మంది ఆటగాళ్లు(players) బీసీసీఐ విచారణలో(BCCI investigation) దొరికిపోయారు. వీరిలో ఇటీవ ల అండర్ 19 ప్రపంచకప్ ఆడిన ప్లేయర్స్ సైతం ఉండడం షాక్‌కు గురిచేసింది. వీరందరిపై బీసీసీఐ నిషేధం విధిస్తూ నిర్ణయం తీ సుకుంది. ఇటీవల  క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(Cricket Association of Bengal) రాష్ట్ర స్థాయిలో తమ ఆటగాళ్లకు వయసు ధృవీకరణ విచారణ చేపట్టింది.

అయితే కొందరు ఆటగాళ్లు తమ వయసును తప్పుగా చూపించిన వ్యవహారం వెలు గులోకి వచ్చింది. దీంతో సదరు ఆటగాళ్లను బీసీసీఐ బ్యాన్ చేసింది. ఈ నిషేధిత జాబితా లో 2022 అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న రవి కుమా ర్ పేరు కూడా ఉంది. అలాగే ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో సిరీస్ కోసం భారత అండర్- 19 జట్టుకు ఎంపికైన లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్ పేరు కూడా ఈ జాబితా లో ఉండడం సంచలనంగా మారింది.

బెంగాల్‌కు రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్, నిర్ణీత పరిమితి కంటే అతడి వయసు 27 నెలలు ఎక్కువ ఉన్నట్లు తేలిం ది. స్టేట్ బోర్డు నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దీంతో అతడిపై బీసీసీఐ బీసీసీఐ రెం డేళ్లపాటు నిషేధం విధించింది. బీసీసీఐకి అనుబంధంగా ఉన్న అన్ని రాష్ట్ర క్రికెట్ సం ఘాలకు ఈ నిషేధం గురించి సమాచారం అందించింది.

సెప్టెంబర్- అక్టోబర్ మధ్య భారత్ - ఆస్ట్రేలియా అండర్ 19 జట్లు ఐదు వన్డేలు, రెండు మల్టీ డే మ్యాచ్ల సిరీస్‌లకు అతడు ఎంపికయ్యాడు. మరోవైపు బెం గాల్ బోర్డు రికార్డుల ప్రకారం రవి కుమార్ వయసులో 45 నెలల వ్యత్యాసం ఉంది. కొంతకా లంగా పలు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లలో ఈ వయసు మోసాలు వెలుగు లోకి వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ నిరంతరం దీనిపై పర్యవేక్షణ జరిపిస్తోంది. 

మరిన్ని వార్తలు