షాద్మాన్‌కు తీవ్ర గాయం
స్ట్రెచర్‌పై బంగ్లా క్రికెటర్ తరలింపు
సిల్హెట్, నవంబర్ 6 : వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ క్రికెటర్ షాద్మాన్ ఇస్లాం(Bangladesh Cricketer Shadman Islam) తీవ్రంగా గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మైదానంలోని మంచు కారణంగా జారిపడటంతో అ తని ఎడమ కాలి మడమ గట్టిగా మెలి తిరిగింది. గాయం అయిన వెంటనే షాద్మాన్ తీవ్రమైన నొప్పితో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. కనీసం నడవలేని స్థితిలో ఉం డటంతో వైద్య సిబ్బంది అతడిని స్ట్రెచ్చర్‌పై మైదానం వెలుపలికి తీసుకువెళ్లారు.
ప్రాథమిక చికిత్స అనంతరం గాయం తీవ్రతను అంచనా వేయడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైద్య బృందం అతడిని ఎంఆర్‌ఐ స్కా న్ కోసం నేరుగా ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, షా ద్మాన్ ఇస్లాం ఈ టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే పరిస్థితిలో లేడని ఫిజియో స్పష్టం చేశారు. అతను ఈ మ్యాచ్ లో మిగిలిన రోజులు ఆడే అవకాశం లేదు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో రాణించిన షాద్మాన్ ఇలా గాయపడటం బంగ్లాదేశ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ. ఇది తలకు తగిలిన గాయం కాకపోవడంతో కన్కషన్ సబ్‌స్ట్టిట్యూట్ తీసుకునే అవకాశం లేదు. దీనివల్ల బంగ్లాదేశ్ జట్టు కేవలం 10 మంది ఆటగాళ్లతోనే ఆడాలి.