బెన్నెట్ అరుదైన రికార్డు
- కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ
- జింబాబ్వే భారీస్కోరు
షార్జా, నవంబర్ 6: జింబాబ్వే కెప్టెన్ బ్రి యాన్ బెన్నెట్(Zimbabwe captain Brian Bennett) అరుదైన రికార్డు సాధించా డు. టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన ఆటగాళ్ల జాబితాలో బ్రియాన్ బెన్నెట్ నిలిచాడు. ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతను ఈ ఘనతను అందుకున్నాడు. రెం డో రోజు ఆటలో సెంచరీ బాదిన కెప్టెన్ బెన్నె ట్ టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరసన బెన్నెట్ నిలిచాడు. ఇప్పటివరకు కోహ్లీ, విజయ్ హజారే, గావస్కర్, గిల్ వంటి 35 మంది క్రికెటర్లు ఈ ఘనత సాధించారు.
దీనిలో విరాట్ కోహ్లీ, గ్రెగ్ చాపెల్ మాత్రం కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదిన క్రికెటర్లుగా రికార్డులకెక్కారు. జింబా బ్వే తరఫున కెపెన్‌గా డెబ్యూ సెంచరీ బాదిన నాలుగో ప్లేయర్‌గా బ్రియాన్ బెన్నెట్ నిలిచా డు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే 504 పరుగుల భారీస్కోరు సాధించింది. బెన్నెట్ (128)తో పాటు బ్రెండన్ టేలర్ కూడా శతకం బాదాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆప్ఘనిస్తాన్ ధీటుగా జవాబిస్తోంది.