ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్ కోచ్‌గా అమిత్ మిశ్రా
న్యూఢిల్లీ, అక్టోబర్ 21 : ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) వచ్చే సీజన్ కోసం పకడ్బందీగా సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా తమ సపోర్టింగ్ స్టాఫ్‌ను పూర్తిగా మార్చేసింది. ఇప్పటికే హెడ్ కోచ్‌గా గంగూలీ, బ్యా టింగ్, అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్, ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా చమిందా వాస్‌లను నియమించిన ఢిల్లీ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
తమ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రాను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించింది. అమిత్ మిశ్రాకు ఢిల్లీ ఫ్రాంచైజీతో ప్రత్యేక అనుబంధం ఉంది. అమిత్ మిశ్రా తన కెరీర్లో ఎక్కువ భాగం ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫునే ఆడాడు.
దాదాపు 10 సీజన్లలో ఢిల్లీకి అతడు ప్రాతినిథ్యం వహించా డు. అప్పుడు కీలక స్పిన్నర్‌గా సేవలందించిన మిశ్రా ఇప్పుడు కోచ్‌గా బాధ్యతలు అం దుకున్నాడు. గత 19 ఏళ్లగా ఢిల్లీని ఐపీఎల్ ట్రోఫీ అందని ద్రాక్షగా ఊరిస్తోంది. గత సీజన్లో కూడా అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన కనబరిచింది. వ రుస ఓటములతో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. డిసెంబర్లో జరిగే మినీ వేలంలోనూ కీలక ఆటగాళ్లపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.