5 September, 2026 | 9:14 AM

హైవోల్టేజ్ ఫైట్

05-09-2026 | 05:45am

* మహిళల ఆసియాకప్‌లో రసవత్తర పోరుకు అంతా సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మధ్య దుబాయ్ వేదికగా హై వోల్టేజ్ ఫైట్ జరగబోతోంది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత మహిళల జట్టు గ్రూప్ స్టేజ్‌ను అజేయంగా ముగించాలని భావిస్తోంది. మరోవైపు బలాబలాల పరంగా తమ కంటే మెరుగ్గా ఉన్న భారత్‌ను ఓడించాలంటే పాక్ అంచనాలకు మించి రాణించాల్సిందే.

  1. నేడు భారత్, పాక్ మహిళల పోరు
  2. దుబాయ్‌లో దాయాదుల సమరం
  3. ఇప్పటికే సెమీస్ చేరిన భారత్ మహిళల ఆసియాకప్

దుబాయి, సెప్టెంబర్ 4 : ప్రపంచ క్రికెట్ లో(World Cricket) భారత్(India), పాకిస్తాన్ జట్లు(Pakistan Teams) ఎప్పుడు ఎక్కడ తలపడినా ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. పురుషుల క్రికెట్(Mens Cricket) అయినా, మహిళల క్రికెట్(Womens Cricket) అయినా కూడా అభిమానుల్లో(Fans) ఈ దాయాదుల సమరంపై ఎక్కడలేని ఆసక్తి నెలకొం టుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో కేవలం ఐసీసీ, ఆసియా కప్(ICC, Asia Cup) వంటి టోర్నీల్లోనే భారత్, పాక్ తలపడతున్నాయి.

తాజాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరుకు కౌంట్‌డౌన్ మొదలైంది. మహిళల ఆసియాకప్‌లో భాగంగా శనివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నా యి. దుబాయి వేదికగా ఈ బిగ్ ఫైట్ జరగబోతోంది. బలాబలాల పరంగానూ, ఫామ్ పరంగానూ భారత జట్టే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. ఇప్పటికే వరుసగా రెండు విజయాలతో సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న భారత్ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. తద్వారా గ్రూప్ స్టేజ్‌ను అజేయంగా ముగించాలని భావిస్తోంది.

కీలక బ్యాటర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన సూపర్ ఫా మ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో హాంకాంగ్ చైనాతో స్మృతి సెంచరీతో రెచ్చిపోయింది. అటు షెఫాలీ కూడా మంచి ఆరంభాన్నే ఇచ్చింది. అయితే ప్రతీకా రావల్, రిఛా ఘోష్,కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. స్మృతి మంచి ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. దుబా యి పిచ్ పరిస్థితులకు భారత బ్యాటర్లు బాగా అలవాటు పడ్డారు.

ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడి తర్వాత హిట్టింగ్‌తో చెలరేగిపోతున్నారు.దీప్తి శర్మ ఆల్‌రౌండ్ నైపుణ్యం కూడా కీలకం కానుంది. అటు బౌలింగ్ విభాగంలో క్రాంతి గౌడ్, నందిని శర్మ , రేణు కా సింగ్ వంటి పేసర్లు ఆరంభంలోనే వికెట్లు తీస్తు అదరగొడుతున్నారు. స్పిన్ విభాగంలో దీప్తి శర్మ, రాధా యాదవ్‌తో పాటు  తెలుగమ్మాయి శ్రీచరణి, ప్రేమ రావత్ తమ స్పిన్ మ్యాజిక్ చూపిస్తున్నారు.

స్పిన్నర్లు సమిష్టిగా రాణిస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు. మరోవైపు భారత్‌తో పోలిస్తే పాక్ జట్టు అన్ని విభాగాల్లోనే బలహీనంగా ఉంది. ధాయ్‌లాండ్ లాంటి చిన్న జట్టుపై పవర్ ప్లేలోనూ మూడు వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడికి గురైంది. పాక్ జట్టు ఎక్కువగా ఓపెనర్ మునీబా అలీ, కెప్టెన్ ఫాతిమా సనాపైనే ఆధారపడుతోంది. మం చి ఫామ్‌లో భారత పేసర్లు, స్పిన్నర్లకు ఎదుర్కొని పరుగులు చేయడం పాక్ బ్యాటర్లకు అంత ఈజీ కాదు.

గత రికార్డులు 

పాకిస్తాన్‌పై భారత మహిళల జట్టుతు తిరుగులేని రికార్డుంది. ఇరు జట్లు 17 టీ ట్వంటీల్లో తలపడితే భారత్ 14 సార్లు గెలిచింది. పాక్ జట్టు కేవలం మూడు సార్లే విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్

దుబాయి పిచ్ స్లో బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకే ఎక్కువ విజయవకాశాలుంటాయి. ఛేజింగ్ చేసే జట్లకు బ్యాటింగ్ చేయడం కష్టంగా మారుతుంది

తుది జట్ల అంచనా

భారత్  : స్మతి మంధాన, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), ప్రతీకా రావల్, రిఛా ఘోష్, ఫుల్మాలీ, దీప్తి శర్మ, ప్రేమా రావత్, నందని శర్మ, శ్రీచరణి, క్రాంతి గౌడ్

పాక్  : మునీబాల అలీ, జుల్ఫికర్, ఫిరో జా, అయేషా, సదాఫ్ సమాస్, ఫాతిమా సనా(కెప్టెన్), ఉమ్ ఇ హనీ, టుబా హసన్, నస్రా సంధు, సాదియా ఇక్బాల్

మరిన్ని వార్తలు