వన్డే ర్యాంకింగ్స్‌లో అర్షదీప్ జోరు

19-11-2026 | 05:05am

12 స్థానాలు మెరుగైన పేసర్

బ్యాటర్ల జాబితాలో గిల్ టాప్

దుబాయి, నవంబర్ 18: టీమిండియా పేస్ బౌలర్ అర్షదీప్ సింగ్(Indian pacer Arshdeep Singh) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. తాజాగా విడుదలైన జాబితాలో అర్షదీప్ 12 స్థా నాలు ఎగబాకి 19వ ర్యాంకులో నిలిచాడు. అక్షర్ పటేల్‌తో కలిసి సంయుక్తంగా ఈ స్థానాన్ని సాధించాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో రాణించడంతో అర్షదీప్ టాప్ దూసుకొచ్చాడు. ఈ సిరీస్‌లో అర్షదీప్ 4 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు.అయితే వన్డే బౌలర్ల జాబితా టాప్ 10లో భారత్‌ను ఒక్కరికీ చోటు దక్కలేదు.

అటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 15వ ర్యాంకులో ఉన్నాడు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ 15 స్థానాలు మెరుగై 12వ ర్యాంకులో నిలిచాడు. మరోవైపు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ శుభమన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో డారిల్ మిఛెల్, మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇటీవల ఆసీస్‌తో సిరీస్ రాణించిన ఇంగ్లాం డ్ బ్యాటర్ టామ్ బాంటన్ ఏకంగా 34 స్థానాలు ఎగబాకి 13వ ర్యాంకులో నిలిచాడు. అలాగే జో రూట్ టాప్ 10లోకి తిరిగొచ్చాడు. 

మరిన్ని వార్తలు