ఆసీస్ కన్సల్టెంట్ కోచ్‌గా హస్సీ

07-11-2026 | 05:15am

మాజీ స్టార్ బ్యాటర్ మైక్ హస్సీకి ఆస్ట్రేలి యా క్రికెట్(Cricket Australia) బోర్డు కీ లక బాధ్యతలు అ ప్పగించింది. తమ పురుషుల క్రికెట్ జట్టు కన్సల్టెంట్ కోచ్(Cricket Team Consultant Coach), టి 20 అడ్వైజర్‌గా నియమించింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ పదవికి వీడ్కోలు పలికిన తర్వాత హస్సీ ఈ బా ధ్యతలను తీసుకున్నాడు. 

హెడ్ కోచ్ ఆం డ్రూ మెక్డొనా ల్‌తో కలిసి హస్సీ పనిచేస్తా డు. ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ వైఫల్యాలను అధిగమించడానికి, రాబోయే ప్రతి ష్ఠాత్మక టోర్నీల కోసం జ ట్టును సిద్ధం చేయడానికి హస్సీ సుదీర్ఘ కాలం పాటు ఈ బాధ్య తల్లో కొనసాగనున్నా డు. 2027లో జరిగే ప్రతిష్ఠాత్మకయా షెస్ సి రీస్, వన్డే ప్రపంచ కప్,  2028 లాస్ ఏం జిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం నేపథ్యంలో టీ20 ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి సారించనున్నాడు.

మరిన్ని వార్తలు