రో-కో ఫీల్డింగ్ షో అదుర్స్.. వైరల్ వీడియో

04-11-2026 | 11:55am

ఒంటి చేత్తో కోహ్లీ మ్యాజిక్.. రోహిత్ మెరుపు త్రో!

బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ రో-కో విధ్వంసం!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి ODIలో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అద్భుతమైన Fieldingతో అదరగొట్టారు. రోహిత్ మెరుపు వేగంతో Run Outలో భాగం కాగా.. కోహ్లీ ఒంటి చేత్తో కళ్లు చెదిరే Catch అందుకున్నాడు. ఈ రెండు విన్యాసాలు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. 22వ ఓవర్‌లో డారిల్ మిచెల్ ఆడిన బంతిని మిడ్ వికెట్ నుంచి వేగంగా అందుకున్న రోహిత్.. వెంటనే Underarm Throw విసిరాడు. వికెట్ల వెనుక కేఎల్ రాహుల్ బంతిని అందుకుని బెయిల్స్ పడగొట్టడంతో మిచెల్ రనౌటయ్యాడు. 

ఇక 29వ ఓవర్‌లో నాథన్ స్మిత్ కొట్టిన బంతి స్లిప్ దిశగా వెళ్లగా.. కుడివైపు డైవ్ చేసిన కోహ్లీ నేలకు అతి సమీపంలో One-Handed Catch అందుకున్నాడు. క్యాచ్‌పై అనుమానంతో థర్డ్ అంపైర్ సమీక్షించినా.. చివరకు అది Clean Catchగా తేలింది. క్యాచ్ పట్టిన ఆనందంలో కోహ్లీ విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలినట్లు సెలబ్రేట్ చేసుకోవడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఈ రెండు అద్భుతాలతో ‘రో-కో’ జోడీ సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశమైంది. ఫిట్‌నెస్, చురుకుదనంలో తామింకా తగ్గలేదని ఇద్దరూ నిరూపించారని అభిమానులు ప్రశంసిస్తున్నారు.


మరిన్ని వార్తలు