భారత్, జపాన్ మధ్య టీ20
- సెప్టెంబర్ 22న చారిత్రక మ్యాచ్
- 75 ఏళ్ల దౌత్య సంబంధాలకు గుర్తుగా నిర్వహణ
ముంబై, సెప్టెంబర్ 4 : భారత క్రికెట్‌లో(Indian cricket) చారిత్రాత్మక మ్యాచ్ జరగబోతోంది. టీమిండియా, జపాన్ క్రికెట్ జట్టులో(Japan cricket team) ఏకైక టీ20 మ్యాచ్ ఆడబోతోంది. ఆసియా క్రీడల(Asian Games) ఆరంభానికి ముందే ఈ మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి బీసీసీఐ(BCCI) అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్(International Cricket Ground) వేదికగా జపాన్‌తో ఏకైక టీ20లో టీమిండియా(Team India) తలప డనుంది. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక మ్యాచ్‌ను నిర్వహించనున్నారు.
‘ఒలింపిక్స్-2036, పారాలింపిక్స్ ఆతిథ్య హక్కులకోసం ప్రయత్నిస్తున్న భారత్ ఆ దిశగా ‘స్పోర్ట్స్ 75’తో తొలి అడుగు వేయనుంనీ, జపాన్‌తో ప్రత్యేక మ్యాచ్ ఆడనుందనీ బీసీసీఐ తెలిపింది. జపాన్ ప్రధాని సనాయె తకైచి, భారత ప్ర ధాని నరేంద్ర మోదీల మధ్య కుదిరిన ఒ ప్పందం ప్రకారం ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇండియా, జపాన్ మధ్య క్రీడల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడమే దీని లక్ష్యమని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది.
శ్రేయస్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. కాగా ఆసియా క్రీడలకు బీసీసీఐ పూర్తి స్ధాయి భారత జట్టును పంపిస్తోంది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ సన్నాహకంగా కూ డా ఉపయోగపడనుంది.కాగా భారత జట్టు ను జపాన్‌కు ఆహ్వానించడం తమకు చారిత్రాత్మక ఘట్టమని జపాన్ క్రికెట్ అసోసియేషన్ సీఈవో నవోకీ మియాజీ వ్యాఖ్యానిం చారు.
దీనికి అంగీకారం తెలిపిన బీసీసీఐకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ లాంటి అత్యుత్తమ జట్టుతో తలపడే అనకాశం రావడం జపాన్ క్రికెటర్లకు గొప్ప విషయమని పేర్కొన్నారు. తమ దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఇది గొప్ప మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. సుజుకి కప్ పేరుతో ఈ ఏకైక కప్‌ను నిర్వహించనున్నారు.






