ఘనంగా అబ్దుల్ కలాం జయంతి
నేరేడుచర్ల,అక్టోబర్ 15(విజయ క్రాంతి): లయన్స్ క్లబ్ నేరేడుచర్ల అధ్యక్షులు షేక్ యూసుఫ్(Sheikh Yusuf, President of Lions Club Nereducherla) అధ్యక్షతన భారతరత్న, మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 95 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలాం చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.
కలాం జీవితం భావిభారత పౌరులకు, విద్యార్థులకు ఆదర్శమని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ బట్టు మధు, ప్రధాన కార్యదర్శి సరికొప్పుల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుండా సత్యనారాయణ, యువకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.