ఉప్పల లింగమల్లమ్మ మృతి బాధాకరం
30-10-2026 | 10:27pm
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు
మోతె,(విజయక్రాంతి): మోతె మండలం సర్వారం గ్రామానికి చెందిన ఉప్పల లింగమల్లమ్మ మృతి బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఏలూరి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం లింగమల్లమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ నగేష్, ఉప సర్పంచ్ మల్సూర్, నాయకులు మారగాని వెంకటయ్య, వీరబోయిన లింగయ్య, వార్డు సభ్యుడు మల్సూర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.