వాసవి-వనిత క్లబ్ ల ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ

29-09-2026 | 06:54pm

నేరేడుచర్ల, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): వాసవి-వనిత క్లబ్(Vasavi-Vanitha Club) నేరేడుచర్ల వారి ఆధ్వర్యంలో దిర్శించర్ల గ్రామంలోని జడ్.పి.హెచ్.ఎస్ విద్యార్థులకు ఐఇసి ఆఫీసర్ రాచకొండ విజయలక్ష్మి సహాయంతో నోటు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా వాసవి క్లబ్ అధ్యక్షుడు నీలా రామ్మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలని, ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా నోటు బుక్స్, ఉచిత బట్టలు, మంచి భోజనం, డిజిటల్ క్లాసులు ఎన్నో సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎం మావిళ్ళ శ్రీనివాస్ రెడ్డి, వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు చారగొండ మల్లికాంబ, కోశాధికారి చారగొండ వెంకటేశ్వర్లు, వనిత సెక్రటరీ జగన్ శివాని, కోశాధికారి వేపాల ఊర్మిల, మాజీ అధ్యక్షుడు ఊటుకూరు నటరాజ్, జూలూరు అశోక్, తాళ్లూరు శ్రీనివాస్, పోదుగంటి సత్యనారాయణ, ఉపాధ్యాయులు శ్రీదేవి నూర్జహాన్, సైదాబీ, విజయకుమార్ రాములు సరస్వతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు