గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం అభినందనీయం
మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి( విజయ క్రాంతి): గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేసే కార్యక్రమం, పిల్లలకు అక్షరాభ్యాసం, అన్న ప్రసన్న కార్యక్రమాలు(Anna Prasana Ceremony) ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చేయడం అభినందనీయమని మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి(Market Chairman Teegala Giridhar Reddy) అన్నారు. మంగళవారంతుంగతుర్తి మండల కేంద్రంలోని పద్మశాలి భవన్ లో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ తుంగతుర్తి వారి అద్వర్యంలో9వ పోషణ మాసం ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి,
ప్రారంభించి ఆయన మాట్లాడారు. పిల్లలకు అక్షరాభ్యాసం, పిల్లలకు అన్నప్రాసన చేర్పించడం జరిగింది, బేటీ బచావో బేటిపడవో, సఖి అవగాహన కార్యక్రమం మన అంగన్వాడీ మన బాధ్యత, పోషణ అభియాన్, పోషణ మాసం తదితర అంశాల మీద అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, తాసిల్దార్ దయానందం ఎంపీడీవో చలపతి, సిడిపిఓ శ్రీదేవి, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు