కక్షిదారులకు న్యాయం చేయడమే నా ధ్యేయం

06-11-2026 | 05:39pm

సివిల్ కోర్టు జడ్జి ఎండి. గౌస్ పాష.

జడ్జ్ బదిలీపై వెళ్లడం బాధాకరమే.. అన్న న్యాయవాదులు.

తుంగతుర్తి, (విజయక్రాంతి): కోర్టులో న్యాయవాలను సమాన దృష్టిలో చూస్తూ, కక్షిదారులకు న్యాయం చేయడమే నా ధ్యేయం అని తుంగతుర్తి సివిల్ కోర్టు జడ్జి ఎండీ గౌస్ పాషా(Judge Ghouse Pasha) అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సివిల్ కోర్టులో పనిచేస్తున్న జడ్జి గౌస్ పాషా బదిలీపై వెళ్తున్న సందర్భంగా, తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నపర్తి జ్ఞాన సుందర్, సభ్యుల ఆధ్వర్యంలో జడ్జ్ కి గజమాల వేసి న్యాయవాదులు, స్థానిక జర్నలిస్టులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ లో పనిచేస్తున్న సిబ్బంది న్యాయవాదులను తన అన్న, చెల్లెలుగా భావించానని పేర్కొన్నారు.ఈ ప్రాంత ప్రజలతో మమేకమై, బదిలీపై వెళ్లడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. సంవత్సరం నరకాలములో, న్యాయవాదులు సిబ్బందితో కలిసి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టానని చాలా సంతోషంగా ఉందని అన్నారు.

సివిల్ కోర్టులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ కక్ష దారుల పట్ల ప్రేమతో, అంకితభావంతో పనిచేయాలని అప్పుడే గుర్తింపు లభిస్తుందని అన్నారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ తాము మీతో ఎంతో నేర్చుకున్నట్లు వాళ్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో సూర్యాపేట బార్ అసోసియేషన్ సభ్యులు గుడిపూడి వెంకటేశ్వర్లు, బత్తిని వెంకటేశ్వర్లు, తుంగతుర్తి బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు పోలీస్ సిబ్బంది, జర్నలిస్టులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు