సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా జాదవ్ అంబాజీ
04-11-2026 | 04:01pm
ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా గిరిజన సంక్షేమ శాఖ(Tribal Welfare Department) డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ(Jadhav Ambaji) అదనపు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశాల మేరకు బుధవారం బాధ్యతలు చేపట్టిన ఆయనకు శాఖ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. శాఖ అభివృద్ధికి, విద్యార్థులు, లబ్ధిదారుల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తానని అంబాజీ తెలిపారు.