రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు విద్యార్థుల ఎంపిక

04-11-2026 | 03:59pm

నిర్మల్ నవంబర్ 4 ( విజయ క్రాంతి): రాష్ట్రస్థాయి పీఎంశ్రీ క్రీడా పోటీలకు(State Level PMShri Sports Competition) నిర్మల్‌ రూరల్‌ మండలం డ్యాంగాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాల(Government Ashram Boys' High School) విద్యార్థులు ఎంపికయ్యారు.

ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్‌లో పీఎంశ్రీ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు తొమ్మిదో తరగతి చదువుతున్న ఎస్. మారుతి, ఏ. నాగేశ్వర్‌ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనూష, జిల్లా క్రీడల అధికారి బుక్య రమేష్‌ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.

మరిన్ని వార్తలు