ఎల్టా ఆధ్వర్యంలో విద్యార్థులకు ఒలంపిఎడ్ ఎక్సమ్,వ్యకృత్వ పోటీలు
మఠంపల్లి నవంబర్ 21(విజయక్రాంతి): మండల ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్(Mandal English Language Teachers Association) (ఎల్టా(ELTA)) ఆధ్వర్యంలో జడ్పిహెచ్ఎస్ మఠంపల్లి పాఠశాలలో(ZPHS Mathampally School) శనివారం ప్రభుత్వ పాఠశాలలో(Government School) చదువుతున్న విద్యార్థులకు మండల స్థాయి ఒలింపిఎడ్ ఎక్సమ్,వ్యకృత్వ పోటీలు ఎల్టా మండల ప్రెసిడెంట్ నందిపాటి సైదులు,జనరల్ సెక్రటరీ ఆర్.మంజునాథ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఒలింపియన్ వ్యకృత్వ పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు,బహుమతులు ప్రధానం మఠంపల్లి మండల విద్యాధికారి బి. వెంకటచారి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో,వివిధ ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లీష్ ఉపాధ్యాయులు వి.జానకి రాములు, శేఖర్,ఎస్.స్లీవారెడ్డి,బి. రాజా,బి.సుజాత,ఆర్. వేణుగోపాల్,టీ లూర్దుమార్రెడ్డి,రోశయ్య,లోకేష్,గుర్వయ్య ఉపాధ్యాయులు పాల్గొన్నారు.