సీఎం సహాయనిధి పధకం.. ఆపదలో ఉన్నవారికి వరం

22-11-2026 | 09:04pm

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

కోదాడ నవంబర్ 22, (విజయక్రాంతి): సీఎం సహాయ నిధి పధకం ఆపదలో ఉన్నవారికి వరమని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి అన్నారు. ఆదివారం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలో నియోజకవర్గంలోని 227 మందికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనారోగ్యం, వివిధ రకాల కారణాలతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నవారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే వారికి తగిన సహాయం అందుతుందన్నారు.

నియోజకవర్గంలోని 227 మందికి రూ. 82,36,000 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు, కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు కందుల కోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు శరభేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, రఘుపతి, సూర్యం, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు