మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

15-10-2026 | 04:43pm

కొలువు దీరిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం.

నేరేడుచర్ల,అక్టోబర్ 15(విజయ క్రాంతి): రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) అభివృద్ధికి కృషి చేస్తామని నూతన చైర్మన్ రంగినేని. స్పందన రాజీవ్ అన్నారు. నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ(Agricultural Market Committee) నూతన చైర్మన్‌గా రంగినేని స్పందన రాజీవ్, వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్ రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన వెంకట్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా చైర్మన్ రంగినేని స్పందన రాజీవ్ మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ పరిధిలో వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి,వాటి పరిష్కారానికి ప్రాధాన్యమిస్తామని తెలిపారు.

రైతులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.నేరేడుచర్ల, పాలకవీడు రెండు మండలాల  రైతులకు మార్కెట్ కమిటీ ద్వారా అందాల్సిన సేవలను మరింత మెరుగుపరచడం, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో పనిచేస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను పలువురు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పెరిక కార్పోరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు,సీనియర్ నాయకులు సాముల శివారెడ్డి, హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,కోతి సంపత్ రెడ్డి,దేశముఖ్, నేరేడుచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి,మోతిలాల్,గోపాల్ నాయక్,సుబ్బారావు,పెండెం శ్రీనివాస్ నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిలర్లు,కోఆప్షన్ సభ్యులు, రెండు మండలాల సర్పంచులు, ఉప సర్పంచు లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు