ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

28-09-2026 | 11:22pm

* కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్(District Collector Tejas Nandlal Pawar) ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీ దారం నుండి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరై, ప్రతి దరఖాస్తును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు.

పెండింగ్ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, లేనియెడల సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ విభాగానికి సంబంధించి 52, డీపీఓ 5, వైద్యారోగ్య శాఖ 4, మహిళా శిశు సంక్షేమం 3, వివిధ శాఖలకు చెందిన 26 అర్జీలు రాగా మొత్తం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్‌రాజ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు