జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సర్పంచ్ కవిత రవి

18-09-2026 | 11:09am

బుర్కచర్లలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

మోతె,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం(Telangana prajapalana dinotsavam) సందర్భంగా మోతె మండల పరిధిలోని బురకచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయం(burkacharla gram panchayat office)లో సర్పంచ్ ధరావత్ కవిత రవి గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసాని మధు, గ్రామ శాఖ అధ్యక్షుడు నిమ్మరబోయిన గోపి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు చిలుముల శ్యాంసుందర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి రవీందర్ అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు